Rain alert: తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు!: వాతావరణ కేంద్రం

తెలంగాణ రైతాంగానికి హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. గురువారం నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Published : 13 Jun 2024 19:40 IST

తెలంగాణ రైతాంగానికి హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. గురువారం నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు.. భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. జూన్‌లో సాధారణ వర్షాపాతమే ఉంటుందని ఆమె చెప్పారు.

Tags :

మరిన్ని