Ramoji Rao: రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి: వివిధ రంగాల ప్రముఖుల ఆకాంక్ష

ఈనాడు పత్రిక ద్వారా తెలుగు జాతిని చైతన్యం చేసిన రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని వివిధ రంగాల ప్రముఖులు కోరారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని కమ్మ సంఘం భవనంలో దివంగత రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు.

Updated : 16 Jun 2024 22:04 IST

ఈనాడు పత్రిక ద్వారా తెలుగు జాతిని చైతన్యం చేసిన రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని వివిధ రంగాల ప్రముఖులు కోరారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని కమ్మ సంఘం భవనంలో దివంగత రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన అక్షరశిల్పి, తెలుగు వైతాళికుడు, క్రమశిక్షణకు మారుపేరు అంటూ కొనియాడారు. వ్యాపార దక్షతతో పాటు ఆయన విలువలు అందరికీ ఆచరణీయమన్నారు. నిఖార్సైన జర్నలిజాన్ని తెలుగు ప్రజలకు అందించిన రామోజీ చిరస్మరణీయుడని కీర్తించారు.

Tags :

మరిన్ని