Thummala: ప్రజావ్యతిరేక శక్తులకు రామోజీ ఎప్పుడూ తల వంచలేదు: మంత్రి తుమ్మల

రామోజీరావు విశ్వసనీయత, గొప్పదనం అందరికీ తెలుసని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Updated : 06 Jul 2024 20:58 IST

రామోజీరావు విశ్వసనీయత, గొప్పదనం అందరికీ తెలుసని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రతి క్షణం ప్రజాహితం తప్ప.. ప్రజా వ్యతిరేక శక్తులకు ఏనాడూ రామోజీ తలవంచలేని స్పష్టం చేశారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి తుమ్మల హాజరయ్యారు. దేశంలో ప్రత్యేకించి ఉభయ రాష్ట్రాల్లో తెలుగు భాష కోసం రామోజీరావు ఎనలేని కృషి చేశారని సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. విలువలతో కూడిన వ్యవస్థలు, సంస్థలు నిర్మించిన ఘనత రామోజీరావుకే దక్కిందని ప్రశంసించారు.

Tags :

మరిన్ని