YS Jagan: తాడేపల్లి ప్యాలెస్ ముందు తొలగిన ఆంక్షలు

తాడేపల్లిలో జనానికి దారి కష్టాలు తీరాయి. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం వెనక నుంచి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, కట్ట దిగువనున్న మార్గాలపై రాకపోకలు నిలిపివేశారు.

Published : 17 Jun 2024 11:20 IST

తాడేపల్లిలో జనానికి దారి కష్టాలు తీరాయి. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం వెనక నుంచి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, కట్ట దిగువనున్న మార్గాలపై రాకపోకలు నిలిపివేశారు. ఆయా మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్లేవారు 1.5 కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి వచ్చేది. ఆయా ప్రాంతవాసులు పడుతున్న ఇబ్బందులపై స్పందించిన కొత్త ప్రభుత్వం ఆ మార్గాల్లో బారికేడ్లు తొలగింపజేసింది. రహదారికి రెండు వైపులా పోలీసు చెక్‌పోస్టులు ఉంచి.. ప్రజల రాకపోకలకు ఆదివారం రాత్రి నుంచి అనుమతించింది.

Tags :

మరిన్ని