congress: కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి

మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Published : 21 Jun 2024 12:21 IST

హైదరాబాద్‌: మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారంతో పాటు ఆయన కుమారుడు కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు భారాస మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు మరికొందరు ఆ పార్టీ నేతలు పోచారం ఇంటికి వెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ ఉన్న సమయంలోనే నిరసనకు దిగారు. ఈ క్రమంలో భారాస, కాంగ్రెస్‌ నేతల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో బాల్క సుమన్‌, భారాస నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :

మరిన్ని