Dharani Portal: ధరణిని సమగ్రంగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం

ధరణిని సమగ్రంగా ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ధరణి కమిటీ సూచనల మేరకు భూములకు సంబంధించిన చట్టాలన్నీ కలిపి సమగ్రంగా ప్రత్యేకచట్టం చేయాలని భావిస్తోంది. ధరణి పేరును భూమాతగా మార్చడం సహా రెవెన్యూ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేసేలా ముసాయిదా బిల్లు తయారవుతోంది

Published : 15 Jun 2024 10:54 IST

ధరణిని సమగ్రంగా ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ధరణి కమిటీ సూచనల మేరకు భూములకు సంబంధించిన చట్టాలన్నీ కలిపి సమగ్రంగా ప్రత్యేకచట్టం చేయాలని భావిస్తోంది. ధరణి పేరును భూమాతగా మార్చడం సహా రెవెన్యూ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేసేలా ముసాయిదా బిల్లు తయారవుతోంది. వచ్చేనెలలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఆ చట్టం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ధరణి పోర్టల్‌ను సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా అందుబాటులోకి తెస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సుమారు 2 లక్షల 20వేల దరఖాస్తులను నెలరోజుల్లో పరిష్కరించాలని అధికారులను భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ ఆదేశించారు.

Tags :

మరిన్ని