Amaravati: రాజధానిపై కక్షతో రింగ్‌రోడ్డును తొక్కేసిన జగన్‌ ప్రభుత్వం

ప్రభుత్వమేదైనా అభివృద్ధిని కాంక్షించాలి.. మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేయాలి. అంతకు ముందున్న ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకొస్తే.. తర్వాత వచ్చే ప్రభుత్వం వాటిని పూర్తిచేసి ప్రజలకు మేలు జరిగేలా చూడాలి.

Updated : 24 Jun 2024 09:32 IST

ప్రభుత్వమేదైనా అభివృద్ధిని కాంక్షించాలి. మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేయాలి. అంతకు ముందున్న ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకొస్తే.. తర్వాతి వారు వాటిని పూర్తిచేసి ప్రజలకు మేలు జరిగేలా చూడాలి. కానీ జగన్ వీటికి అతీతం. ఆయనకు తెలిసింది కేవలం విధ్వంసం మాత్రమే. అమరావతికి చుట్టూ నిర్మించలని తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేను తెరమరుగు చేసి, దానిబదులు తన సొంత నియోజకవర్గం పులివెందుల మీదుగా వెళ్లేలా కోడూరు నుంచి మేదరమెట్ల వరకు ఎక్స్‌ప్రెస్‌వేని మంజూరు చేయించుకొని పక్షపాతం చూపారు. ఇటువంటి తరుణంలో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఓఆర్‌ఆర్‌కు, అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు తక్షణం ఊపిరి పోయాలి. వెంటనే ఇవి మొదలైతే రెండు, మూడేళ్లలో వీటిని పూర్తిచేసే అవకాశం ఉంది.

Tags :

మరిన్ని