Rohit Sharma: రోహిత్ ‘600’ సిక్సర్ల వీరుడు.. ఐర్లాండ్‌పై హిట్టింగ్‌ చూశారా?

టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ మూడు సిక్సర్లు బాదాడు.

Published : 06 Jun 2024 10:19 IST

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. తన తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. బుధవారం 8 వికెట్ల తేడాతో టీమ్‌ఇండియా విజయం సాధించింది. ఐర్లాండ్‌ నిర్దేశించిన 97 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (52 రిటైర్డ్‌ హర్ట్‌; 37 బంతుల్లో 4×4, 3×6) అదరగొట్టాడు. బ్యాటింగ్‌కు కష్టమైన ఈ పిచ్‌పై మూడు సిక్సర్లు బాదాడు. దీంతో రోహిత్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో 600 సిక్సర్లు పూర్తి చేసుకొని రికార్డు సృష్టించాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి

Tags :

మరిన్ని