Russia: సిబ్బందిని బంధించిన ఖైదీలు.. మట్టుబెట్టిన బలగాలు

రష్యాలోని ఒక నిర్బంధ కేంద్రంలో కొంతమంది విచారణ ఖైదీలు కలిసి సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం కలకలం రేపింది.

Published : 17 Jun 2024 12:49 IST

రష్యాలోని ఒక నిర్బంధ కేంద్రంలో కొంతమంది విచారణ ఖైదీలు కలిసి సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం కలకలం రేపింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఆ ఖైదీలను హతమార్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. రోస్తోవ్-ఆన్-డాన్ నగరంలోని ప్రీ-ట్రయల్ డిటెన్షన్ సెంటర్‌లో ఆరుగురు ఖైదీలు కలిసి ఇద్దరు జైలు గార్డులను బందీలుగా పట్టుకున్నారు. వారికి ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయని మీడియా తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. ఆ ఖైదీలను మట్టుబెట్టినట్లు పేర్కొంది. బందీలుగా ఉన్న ఇద్దరూ సురక్షితంగా బయటపడినట్లు మీడియా తెలిపింది. మృతి చెందిన ఖైదీలు పెన్నులు, లాఠీలు, గొడ్డళ్లను ఆయుధాలుగా కలిగి ఉన్నారని వెల్లడించింది.

Tags :

మరిన్ని