Putin: ఉత్తర కొరియాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పర్యటన

ఉత్తర కొరియాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్లారు.

Published : 19 Jun 2024 14:37 IST

ఉత్తర కొరియాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్లారు. ప్యాంగ్యాంగ్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లిన కిమ్.. పుతిన్‌కు ఆహ్వానం పలికారు. అనంతరం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పుతిన్-కిమ్ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌తో సంఘర్షణ నేపథ్యంలో రష్యాకు తమ మద్ధతు ఉంటుందని కిమ్ తెలిపారు.

Tags :

మరిన్ని