Tummala: అసలైన అర్హులకే సంక్షేమ ఫలాలు అందేలా చూస్తాం: మంత్రి తుమ్మల

భారాస ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల అనర్హులకు సంక్షేమ ఫలాలు అందించి ప్రజాధనం వృథా చేశారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.

Published : 14 Jun 2024 19:50 IST

భారాస ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల అనర్హులకు సంక్షేమ ఫలాలు అందించి ప్రజాధనం వృథా చేశారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. రైతుసంఘాల నేతలు, అన్నదాతల అభిప్రాయాలు తీసుకుని.. అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాకే.. రైతుభరోసా, పంటలబీమా పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు అసలైన అర్హులకే సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తామని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల అనర్హులకు సంక్షేమ ఫలాలు అందించి ప్రజాధనం వృథా చేశారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. 

Tags :

మరిన్ని