AP News: ఏపీవ్యాప్తంగా సీజన్‌ వ్యాధుల కట్టడికి ప్రభుత్వం చర్యలు

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అతిసారం కట్టడిపై వివిధ శాఖల అధికారులతో సీఎస్‌ నీరభ్‌ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంచినీటి పైపులైన్లు లీకేజీలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

Published : 22 Jun 2024 12:34 IST

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అతిసారం కట్టడిపై వివిధ శాఖల అధికారులతో సీఎస్‌ నీరభ్‌ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంచినీటి పైపులైన్లు లీకేజీలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. జులై 1 నుంచి డయేరియా నియంత్రణపై ఏపీవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, పురపాలక శాఖ మంత్రి నారాయణ సమావేశమయ్యారు. డయేరియా ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

Tags :

మరిన్ని