Darshan Case: కరెంట్ షాక్‌ ఇచ్చి చిత్రహింసలు.. దర్శన్‌ అభిమాని హత్యకేసులో విస్తుపోయే విషయాలు

కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Published : 18 Jun 2024 12:02 IST

కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు బాధితుడిని చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. రేణుకస్వామికి నిందితులు కరెంట్ షాక్  ఇచ్చినట్లు తేలింది. ఈ కేసులో హాస్య నటుడు చిక్కన్నకు పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. హత్య జరిగిన రోజు దర్శన్ వెంట చిక్కన్న ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని