Nara Lokesh: ఏపీలో గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటాం!: మంత్రి నారా లోకేశ్‌

రాబోయే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్‌ పెడతామని మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన బక్రీద్ ప్రార్ధనలలో నారా లోకేశ్‌ పాల్గొన్నారు.

Published : 17 Jun 2024 13:37 IST

రాబోయే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్‌ పెడతామని మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన బక్రీద్ ప్రార్ధనలలో నారా లోకేశ్‌ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముగ్గురు తెదేపా కార్యకర్తలను వైకాపా నేతలు హత్య చేసినా.. తాము సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే తాము నడుచుకుంటున్నామని మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో ఇంకా బయటికి రావలసిన చిత్రాలు చాలా ఉన్నాయని అన్నారు. ప్రజా దర్బార్‌ను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి లోకేశ్‌ చెప్పారు.

Tags :

మరిన్ని