Vizianagaram: కదులుతున్న కారుపై.. ఔరా అనిపిస్తున్న యువకుడి స్టంట్స్‌!

ఆ కుర్రాడు మాత్రం అవలీలగా కారును నడిపేస్తాడు. కాళ్లనే చేతుల్లా వాడుతూ స్టీరింగ్ తిప్పుతూ రద్దీగా ఉన్న రోడ్లపైనా.. 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాడు. ఇవేవో సినిమాల్లో హీరోలు చేసే స్టంట్స్‌ కావు. విజయనగరంలో ఓ డ్రైవింగ్ స్కూల్ శిక్షకుడి విన్యాసాలు.

Published : 09 Jul 2024 16:03 IST

రోడ్ల మీద తడబాటు లేకుండా వాహనాలు నడపడానికి ఆపసోపాలు పడతాం. కానీ ఆ కుర్రాడు మాత్రం అవలీలగా కారును నడిపేస్తాడు. రద్దీగా ఉన్న రోడ్లపైనా.. 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాడు. ఎలాంటి బెరుకు, తడబాడు లేకుండా.. కాళ్లనే చేతుల్లా వాడుతూ స్టీరింగ్ తిప్పుతూ.. గేర్లు మారుస్తూ.. ఇండికేటర్స్ వేసేస్తాడు. ఇవేవో సినిమాల్లో హీరోలు చేసే స్టంట్స్‌ కావు. విజయనగరంలో ఓ డ్రైవింగ్ స్కూల్ శిక్షకుడి విన్యాసాలు. అబ్బురపరుస్తున్న ఆ యువకుడి స్టంట్స్‌పై ఓ లుక్కేద్దాం. 

Tags :

మరిన్ని