Kishan Reddy: సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామనేది పచ్చి అబద్ధం: కిషన్ రెడ్డి

సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామనేది పచ్చి అబద్ధమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Updated : 22 Jun 2024 20:30 IST

సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామనేది పచ్చి అబద్ధమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే అత్యంత పారదర్శకంగా, బొగ్గు గనుల వేలం జరుగుతోందని వెల్లడించారు. బొగ్గు గనుల వేలం ద్వారా వచ్చే నిధులలో.. ఒక్క పైసా కూడా కేంద్రం తీసుకోదని చెప్పారు. కేసీఆర్ కుటుంబం, భారాస నేతల జోక్యంతో సింగరేణి దివాళా తీసే పరిస్థితి నెలకొందని కేంద్ర మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ కుటుంబం సింగరేణిలో చేసిన దోపీడీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

Tags :

మరిన్ని