Uppada Coast: సాగర గర్భంలో కలుస్తున్న ఉప్పాడ..!

దేశంలోనే పొడవైన సముద్రతీర ప్రాంతం కలిగిన రెండో అతిపెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సముద్రంపైనే ఆధారపడి లక్షలాది మత్స్యకారుల కుటుంబాలు జీవిస్తున్నాయి. అలాంటి తీర ప్రాంతంలో ప్రధానమైన ఉప్పాడను ఇప్పుడు కడలి కబళిస్తోంది.

Published : 09 Jul 2024 15:45 IST

దేశంలోనే పొడవైన సముద్రతీర ప్రాంతం కలిగిన రెండో అతిపెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పోర్టులు, బీచ్‌లు, పర్యటక ప్రాంతాలతో ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. తూర్పు తీరానికి వెన్నుదన్నులా నిలుస్తోంది. సముద్రంపైనే ఆధారపడి లక్షలాది మత్స్యకారుల కుటుంబాలు జీవిస్తున్నాయి. అలాంటి తీర ప్రాంతంలో ప్రధానమైన ఉప్పాడను ఇప్పుడు కడలి కబళిస్తోంది. కెరటాల ఉద్ధృతి తట్టుకోలేక ఆ గ్రామం కొద్దికొద్దిగా సాగర గర్భంలో కలుస్తోంది. రక్షణ గోడలు నిర్మించినా.. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అవి కూడా కనుమరగయ్యాయి. సముద్రాన్నే నమ్ముకున్న గంగపుత్రుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సమస్యపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  ప్రత్యేకదృష్టి సారించారు. ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శించి రక్షణచర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఉప్పాడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం.

Tags :

మరిన్ని