TG News: బోరు ఓ చోట.. నీళ్లు మరో చోట!.. రైతుకు వింత అనుభవం

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని తాళ్లకుంట తండాలో మనీ అనే రైతుకు వింత అనుభవం ఎదురైంది.

Updated : 22 Jun 2024 15:17 IST

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని తాళ్లకుంట తండాలో మణి అనే రైతుకు వింత అనుభవం ఎదురైంది. పంటసాగుకు నీటి కొరత వేధిస్తుండడంతో బోరు వేయాలని భావించిన రైతును.. బోరు పాయింట్ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. తనకున్న వ్యవసాయ భూమిలో బోరు వేసే క్రమంలో మొదటి పాయింట్‌లో బోరు పడకపోవడంతో ఆ రైతు నిరాశకు గురయ్యాడు. రెండవ పాయింట్ బోరు వేస్తుండగా ఒక్కసారిగా మొదటి పాయింట్‌లో నీళ్లు ఎగసిపడ్డాయి. ఊహించని విధంగా నీళ్లు రావడంతో ఆ రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

Tags :

మరిన్ని