Strange thing: పర్వతశ్రేణిలో అద్దం లాంటి విచిత్ర వస్తువు..!

అమెరికా లాస్‌వేగాస్ సమీపంలోని ఓ మారుమూల పర్వతశ్రేణిలో విచిత్రమైన వస్తువు దర్శనమిచ్చింది. మోనోలిత్‌లా కనిపించే ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా తయారైందో మిస్టరీగానే ఉండిపోయింది.

Updated : 20 Jun 2024 15:22 IST

అమెరికా లాస్‌వేగాస్ సమీపంలోని ఓ మారుమూల పర్వతశ్రేణిలో విచిత్రమైన వస్తువు దర్శనమిచ్చింది. మోనోలిత్‌లా కనిపించే ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా తయారైందో మిస్టరీగానే ఉండిపోయింది. నిర్మానుష్య ప్రాంతంలో రాళ్ళ మధ్య స్థాపించినట్లుగా, దీర్ఘచతురస్రాకారంలో మెరుస్తూ కనిపించింది. అద్దం లాగా ఉండి చుట్టూ ఉన్న పర్వతాలను ప్రతిబింబిస్తోంది. ఎడారి పర్వత ప్రాంతంలోని గ్యాస్ పీక్ అనే 6వేల 937 అడుగుల ఎత్తైన శిఖరంపై ఇది ఉన్నట్లు తెలిసింది. 2001లో వచ్చిన స్పేస్ ఒడిస్సీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ఇలాంటి వస్తువే కనిపిస్తుంది. అమెరికాలోని ఏరియా ఫిఫ్టీవన్‌లో ఏలియన్ల ఫ్లైయింగ్ సాసర్లు కనిపిస్తాయని చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే రెడ్-రాక్ ఎడారి, తర్వాత రొమేనియా, సెంట్రల్ కాలిఫోర్నియా, ఫ్రీమాంట్ స్ట్రీట్ వంటి ప్రాంతాల్లో ఈ గుర్తు తెలియని మోనోలిత్‌లు కనిపించాయి.

Tags :

మరిన్ని