Hyderabad: మహిళపై వీధికుక్కల దాడి.. సోషల్‌ మీడియాలో వైరల్‌

వీధి కుక్కల గుంపు నడుచుకుంటూ వెళ్తోన్న ఓ మహిళపై దాడికి దిగిన ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. వాటి దాడి నుంచి ఆ మహిళ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది.

Updated : 23 Jun 2024 13:24 IST

మహిళపై వీధికుక్కల దాడి.. సోషల్‌ మీడియాలో వైరల్‌

వీధి కుక్కల గుంపు నడుచుకుంటూ వెళ్తోన్న ఓ మహిళపై దాడికి దిగిన ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. వాటి దాడి నుంచి ఆ మహిళ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిత్రపురి కాలనీలో ఈ ఘటన జరిగింది. చిత్రపురి కాలనీలో నడుచుకుంటూ వెళ్తోన్న మహిళపై వీధికుక్కలు దాడికి యత్నించాయి. చుట్టుముట్టిన వీధి శునకాల బారి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. వాటి నుంచి తప్పించుకునే  క్రమంలో కిందపడిపోయినా.. కుక్కలను అదిలించే ప్రయత్నం చేసింది. ఇంతలో ఓ ద్విచక్రవాహనదారుడు, కారు రావడంతో కుక్కలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాలన్నీ  సమీపంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

Tags :

మరిన్ని