Teachers Transfer: ఉపాధ్యాయ బదిలీలతో ఏడుస్తున్న విద్యార్ధులు

మమతలు పంచి, మనసులు గెలుచుకునే ఉపాధ్యాయుల పట్ల విద్యార్ధులకు అవ్యాజమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. కొందరు ఉపాధ్యాయులు కూడా పిల్లలను అంతే ప్రేమగా చూస్తారు. అది ఉపాధ్యాయ బదీలీల సందర్భంగా బయటపడింది.

Published : 08 Jul 2024 17:04 IST

గురువంటే నిత్య చైతన్యదీప్తి. అక్షరాల దీపం వెలిగించే ‘వెలుగుల కాంతి’. పిల్లల తలరాతను మార్చే ఆధునిక బ్రహ్మ. మమతలు పంచి, మనసులు గెలుచుకునే ఉపాధ్యాయుల పట్ల విద్యార్ధులకు అవ్యాజమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. కొందరు ఉపాధ్యాయులు కూడా పిల్లలను అంతే ప్రేమగా చూస్తారు. అది ఉపాధ్యాయ బదీలీల సందర్భంగా బయటపడింది. ఉపాధ్యాయులు బదిలీపై వేరే పాఠశాలకు వెళితే.. చాలా చోట్ల విద్యార్థులు వారిని విడిచి ఉండలేక బోరున విలపించారు. మరి కొందరు వెళ్లవద్దంటూ వారి వాహనాలకు అడ్డుపడ్డారు. ఈ దృశ్యాలు విద్యార్థులు-ఉపాధ్యాయుల మధ్య బంధానికి అద్దం పట్టాయి.

Tags :

మరిన్ని