TG News: విద్యార్థుల ఫిర్యాదుతో ప్రిన్సిపల్‌పై బదిలీ వేటు!

సూర్యాపేట జిల్లా బాలెంలలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు చేసిన ఫిర్యాదుతో ప్రిన్సిపల్ శైలజపై బదిలీ వేటు పడింది.

Updated : 07 Jul 2024 13:41 IST

సూర్యాపేట జిల్లా బాలెంలలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు చేసిన ఫిర్యాదుతో ప్రిన్సిపల్ శైలజపై బదిలీ వేటు పడింది. కొంత కాలంగా కళాశాలలో మద్యం సేవిస్తూ.. తమను వేధిస్తున్నారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కళాశాలలో సమస్యలపై ప్రశ్నిస్తే సిబ్బందితో కలిసి తమను ఇబ్బందులకు గురి చేస్తోందని.. సహాయకురాలు సౌమిత్రితో మద్యం సేవిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. ఈ విషయం అధికారులు దృష్టికి వెళ్లడంతో ప్రిన్సిపల్‌పై ప్రాథమిక విచారణ జరిపారు. ఘటనపై రాష్ట్ర పౌరసరఫరాల, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. పూర్తిస్థాయి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు