Uravakonda: చెట్ల కిందే తరగతులు.. బ్లాక్ బోర్డుగా ప్రహరీ గోడ!: ఉరవకొండలో విద్యార్థుల దుస్థితి

వైకాపా పాలనలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు సొంత భవనాలకు నోచుకోలేదు. అనంతపురం జిల్లా ఉరవకొండ శివరామిరెడ్డి కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏడాదిన్నరగా చెట్ల కిందే తరగతులు నిర్వహిస్తున్నారు.

Published : 09 Jul 2024 20:45 IST

వైకాపా పాలనలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు సొంత భవనాలకు నోచుకోలేదు. అనంతపురం జిల్లా ఉరవకొండ శివరామిరెడ్డి కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏడాదిన్నరగా చెట్ల కిందే తరగతులు నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాల, డీఆర్‌డీఏ భవనాల ప్రాంగణంలోని 2 గదుల రేకుల షెడ్డును ఆసరాగా చేసుకుని చెట్ల కింద పాఠాలు బోధిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన ప్రహరీ గోడను బ్లాక్ బోర్డులుగా మార్చి బోధన సాగించాల్సిన దుస్థితి నెలకొందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల భవనం లేదని, మౌలిక వసతులు కల్పించాలని విద్యాధికారులకు పలుమార్లు చెప్పినా స్పందన లేదని వాపోయారు.

Tags :

మరిన్ని