Sreesanth: తిరుమల శ్రీవారి సేవలో టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్

తిరుమల శ్రీవారిని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్ (Sreesanth) దర్శించుకున్నారు.

Published : 11 Jul 2024 12:38 IST

తిరుమల శ్రీవారిని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్ (Sreesanth) దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీశాంత్ దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని