TS News: జనాభా ప్రాతిపదికన నిధులివ్వండి: కేంద్ర ఆర్థిక మంత్రికి భట్టి విక్రమార్క విజ్ఞప్తి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ నేతృత్వంలో జరిగిన కేంద్ర బడ్జెట్‌ సన్నద్ధత సమావేశంలో తెలంగాణ తరఫున డిమాండ్లను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వినిపించారు.

Published : 23 Jun 2024 09:56 IST

‘కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలకు ఒక నిర్దిష్ట విధానాన్ని పాటించడంలేదు. రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే ఆ నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం దామాషా పద్ధతిలో విడుదల చేయాలి’ అని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఇక్కడి భారత మండపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ నేతృత్వంలో జరిగిన కేంద్ర బడ్జెట్‌ సన్నద్ధత సమావేశంలో, ఆ తర్వాత జీఎస్టీ మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ తరఫున డిమాండ్లను వినిపించారు.

Tags :

మరిన్ని