Ramoji Rao: పాత్రికేయలోకానికి రామోజీరావు దిక్సూచీ: జర్నలిస్టుల సంఘాల నేతలు

పాత్రికేయలోకానికి రామోజీరావు ఓ దిక్సూచీగా ఉండేవారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పేర్కొంది.

Updated : 14 Jun 2024 18:05 IST

పాత్రికేయలోకానికి రామోజీరావు ఓ దిక్సూచీగా ఉండేవారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పేర్కొంది. ఆయన లేని లోటు పూడ్చలేనిదని సంఘనాయకులు అన్నారు. రామోజీరావు మృతికి సంతాపంగా హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నిర్వహించిన కార్యక్రమంలో.. పలు జర్నలిస్టు సంఘాల నేతలు పాల్గొన్నారు. రామోజీరావు కృషిని, ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు పదాలకు ‘ఈనాడు’ పుట్టినిల్లుగా అభివర్ణించారు. ఎందరో పాత్రికేయులను అందించిన అక్షర సైనికుడు రామోజీరావు అని కొనియాడారు.

Tags :

మరిన్ని