Chandrababu-Revanth Reddy: నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ నేడు జరగనుంది.

Published : 06 Jul 2024 10:54 IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ నేడు జరగనుంది. విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా సాయంత్రం 6గంటలకు ప్రజాభవన్ వేదికగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సుమారు రెండు గంటలు జరిగే ఈ సమావేశంలో సుమారు 15 అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. 9, 10వ షెడ్యూళ్లలోని సంస్థల పంపిణీ సహా విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల విభజన వంటి చిక్కుముళ్లపై సమాలోచనలు చేయనున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు తమ పరిధిలో ఉన్న మూడు భవనాలను తమకే ఇవ్వాలని ఏపీ కోరే అవకాశం ఉంది.

Tags :

మరిన్ని