అమెరికాలో దోపిడీ దొంగ కాల్పులు.. తెలుగు యువకుడి మృతి

అమెరికాలో ఓ దుకాణంలో జరిగిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతిచెందాడు.

Published : 23 Jun 2024 10:39 IST

అమెరికాలో దోపిడీ దొంగ కాల్పులు.. తెలుగు యువకుడి మృతి

అమెరికాలో ఓ దుకాణంలో జరిగిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతిచెందాడు. మృతుడిని ఏపీలోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణగా గుర్తించారు. గోపీకృష్ణ జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆర్కెన్సాస్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపి కౌంటర్‌లో ఉండగా.. ఓ దుండగుడు వచ్చి అతడి మీద కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత గోపీకృష్ణను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. 

Tags :

మరిన్ని