T.G.Bharath: నేనూ, లోకేశ్‌ కలిసి పరిశ్రమల రంగాన్ని అభివృద్ధి చేస్తాం: టీజీ భరత్‌

గత ఐదేళ్లు ఏపీ అంటేనే పారిశ్రామిక వర్గాల్లో భయాందోళన ఉందని దాన్ని మార్చి నమ్మకం కల్పిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ భరోసా ఇచ్చారు.

Updated : 20 Jun 2024 12:08 IST

గత ఐదేళ్లు ఏపీ అంటేనే పారిశ్రామిక వర్గాల్లో భయాందోళన ఉందని దాన్ని మార్చి నమ్మకం కల్పిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ భరోసా ఇచ్చారు. సచివాలయంలో నాలుగో బ్లాక్‌లో పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు, లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం సింగిల్ విండో ఉన్నప్పటికీ అందుకు అనువైన వాతావరణం లేదని, దాన్ని సంస్కరించి మెరుగైన విధానం తెస్తామని చెప్పారు. కర్నూలులోనూ పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి భరత్  వెల్లడించారు.

Tags :

మరిన్ని