Hyderabad: యూపీఎస్సీ పరీక్షకు ఆలస్యం.. అభ్యర్థినికి ట్రాఫిక్‌ పోలీస్‌ సాయం

యూపీఎస్సీ పరీక్షకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఓ అభ్యర్థినికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సాయం చేశారు.

Updated : 16 Jun 2024 17:17 IST

యూపీఎస్సీ పరీక్షకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఓ అభ్యర్థినికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సాయం చేశారు. విద్యార్థినికి ఆలస్యం అవుతుండటంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్‌ ద్విచక్రవాహనంపై రాజేంద్రనగర్‌లోని పరీక్షాకేంద్రానికి తీసుకెళ్లారు. అభ్యర్థినిని సరైన సమయానికి పరీక్ష కేంద్రంలో దింపిన కానిస్టేబుల్ సురేశ్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.

Tags :

మరిన్ని