Crime News: మేడ్చల్‌లో దారుణం.. బంగారు ఆభరణాల షాప్ యజమానిపై కత్తితో దుండగుల దాడి!

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో అంతర్రాష్ట్ర ముఠా అలజడి సృష్టించింది. పట్టపగలే బంగారు ఆభరణాల దుకాణంలోకి ఇద్దరు దుండగులు చొరబడి యజమానిపై కత్తితో దాడికి పాల్పడ్డారు.

Updated : 20 Jun 2024 16:45 IST

మేడ్చల్‌లో దారుణం.. బంగారు ఆభరణాల షాప్ యజమానిపై కత్తితో దుండగుల దాడి!

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల ముఠా అలజడి సృష్టించింది. పట్టపగలే బంగారు ఆభరణాల దుకాణంలోకి ఇద్దరు దుండగులు చొరబడి యజమానిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న జగదాంబ జ్యువెలర్స్‌కి మధ్యాహ్నం సుమారుగా 1:30 సమయంలో బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు.. చాకుతో షాప్ యజమాని శేషరాంను పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లారు. నిందితుల దాడి దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. వీరిలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోగా.. మరో వ్యక్తి ముసుగు ధరించి వచ్చాడు. గాయాలతో ఉన్న షాప్ యాజమానిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకొని వెళ్లారు. భాదితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు