Bridge Collapses: వరుసగా కుప్పకూలుతున్న వంతెనలు.. భయాందోళనలో ప్రజలు

బిహార్‌లో (Bihar) వరుసగా వంతెనలు కుప్పకూలుతున్నాయి. ఇప్పటికే రెండు బ్రిడ్జిలు పేకమేడలా కూలిపోగా (Bridge Collapses).. తాజాగా తూర్పు చంపారన్‌ జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న మరో వంతెన కూలిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. వారం రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం.

Updated : 24 Jun 2024 11:52 IST

బిహార్‌లో (Bihar) వరుసగా వంతెనలు కుప్పకూలుతున్నాయి. ఇప్పటికే రెండు బ్రిడ్జిలు పేకమేడలా కూలిపోగా (Bridge Collapses).. తాజాగా తూర్పు చంపారన్‌ జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న మరో వంతెన కూలిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. వారం రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మోతీహరి ప్రాంతంలో రూ.1.5 కోట్ల వ్యయంతో 16 మీటర్ల వంతెనను నిర్మిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ వంతెన కూలిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు శాఖా పరమైన దర్యాప్తునకు ఆదేశించారు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఈ వంతెన నిర్మాణానికి గతంలో స్థానికులు అడ్డుపడ్డారు. దీంతో వారే కూల్చేసి ఉంటారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

మరిన్ని