విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి లేకపోతే.. కేసీఆర్‌ వాస్తవాలు వివరించాలి: బండిసంజయ్‌

విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణచేస్తున్న జస్టిస్ నర్సింహరెడ్డిని అవమానించేలా రాతపూర్వకంగా కేసీఆర్ ఇచ్చిన వివరణ ఆయన అహంకార పూరిత వైఖరికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు.

Updated : 16 Jun 2024 11:54 IST

విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణచేస్తున్న జస్టిస్ నర్సింహరెడ్డిని అవమానించేలా రాతపూర్వకంగా కేసీఆర్ ఇచ్చిన వివరణ ఆయన అహంకార పూరిత వైఖరికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రప్రభుత్వం చట్టబద్ధంగా నియమించిన కమిషన్‌కు కనీస గౌరవం ఇవ్వాలని ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌కు తెలియకపోవడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై విచారణ చేస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేస్తే వాస్తవాలను ముందుంచాల్సిన కేసీఆర్.. ఆ కమిషన్‌నే అవమానించేలా లేఖరాయడం క్షమించరానిదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్న కేసీఆర్ వాదనలో పస ఉంటే కోర్టుకి ఎందుకు వెళ్లలేదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

Tags :

మరిన్ని