Chiranjeevi - Bandi Sanjay: మెగాస్టార్ చిరంజీవితో బండి సంజయ్‌ ఆత్మీయ సమావేశం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న బండి సంజయ్‌ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు.

Published : 23 Jun 2024 22:24 IST

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న బండి సంజయ్‌ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి సత్కరించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ తమను దగ్గరకు తీసుకుని పలకరించడం మర్చిపోలేని అనుభూతిగా మిగిలిందని చిరంజీవి తెలిపారు. అనంతరం ఇరువురు దేశ, రాష్ట్ర రాజకీయాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.

Tags :

మరిన్ని