Bandi Sanjay: ఏ సందర్భంలోనైనా నిక్కచ్చిగా వ్యవహరించే వ్యక్తి రామోజీరావు: బండి సంజయ్

కరీంనగర్‌లోని ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘన నివాళి అర్పించారు. రామోజీరావుతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Published : 20 Jun 2024 14:43 IST

కరీంనగర్‌లోని ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘన నివాళి అర్పించారు. రామోజీరావుతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయనతో తనది గురుశిష్యుల బంధమని సంజయ్‌ చెప్పారు. రామోజీ క్రమశిక్షణ, నిజాయతీ, నిక్కచ్చితనం కారణంగా ఈనాడు సంస్థల పట్ల సమాజంలో ఎంతో గౌరవం ఏర్పడిందని కొనియాడారు. ఈనాడు సంస్థలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 

Tags :

మరిన్ని