Mulugu District: ములుగు జిల్లాలో గిరిజనుల ఆరోగ్యం కోసం డాక్టర్‌ సాహసం..!

ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు జ్వరమొచ్చినా, జబ్బు చేసినా నాటు మందులే దిక్కు. దట్టమైన అడవుల్లోకి చికిత్స అందించేందుకు వైద్యులు ముందుకు రారు. కానీ, ములుగు జిల్లా వాజేడు పీహెచ్‌సీ వైద్యాధికారి మధుకర్ మాత్రం తెగువ చూపి వృత్తిపై నిబద్ధతతో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు.

Published : 11 Jul 2024 15:10 IST

ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు జ్వరమొచ్చినా, జబ్బు చేసినా నాటు మందులే దిక్కు. దట్టమైన అడవుల్లోకి రవాణా సౌకర్యాలు లేక.. చికిత్స అందించేందుకు వైద్యులు ముందుకు రారు. కానీ, ములుగు జిల్లా వాజేడు పీహెచ్‌సీ వైద్యాధికారి మధుకర్ మాత్రం తెగువ చూపి వృత్తిపై నిబద్ధతతో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు. కొండలు, వాగులు దాటి వాజేడు నుంచి 16 కిలోమీటర్ల దూరం వెళ్లి పెనుగోలు గ్రామంలో వైద్య సేవలు అందించారు. ముగ్గురు గ్రామస్థుల సాయంతో వైద్య సిబ్బంది నడుము లోతులో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులను దాటి వెళ్లి హెల్త్ క్యాంప్ నిర్వహించారు. పెనుగోలు గ్రామంలోని 10 కుటుంబాల్లో 39 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 

Tags :

మరిన్ని