Ponnam: ఆక్సిజన్‌ పెట్టుకునే రోజు రాకూడదంటే మొక్కలు నాటాలి: మంత్రి పొన్నం

తెలంగాణ వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమంలో ఉత్సాహంగా జరుగుతోంది.

Updated : 05 Jul 2024 16:26 IST

తెలంగాణ వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమంలో ఉత్సాహంగా జరుగుతోంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన వనమహోత్సవంలో కలెక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. మాస్కు, ఆక్సిజన్ పెట్టుకునే రోజులు ఎప్పటికీ రాకూడదంటే.. తక్షణ కర్తవ్యంగా మొక్కలను నాటి సంరక్షించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్‌లో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మొక్కలు నాటారు.     

Tags :

మరిన్ని