Vangalapudi Anitha: 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌.. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు: మంత్రి అనిత

ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని చూస్తే సహించేది లేదని హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) హెచ్చరించారు.

Updated : 19 Jun 2024 15:39 IST

ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని చూస్తే సహించేది లేదని హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) హెచ్చరించారు. హోంమంత్రిగా సచివాలయంలో బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌ రవాణా తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పోలీసుల్లో గత ప్రభుత్వ ఆలోచనలతో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని కోరారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.

Tags :

మరిన్ని