Veeranjaneya Swamy: గత ప్రభుత్వం ఆపేసిన సంక్షేమ పథకాలను పునఃప్రారంభిస్తాం: మంత్రి వీరాంజనేయస్వామి

పేదరికం లేని సమాజం చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

Published : 18 Jun 2024 13:04 IST

పేదరికం లేని సమాజం చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. నిధుల లేమితో రాష్ట్రంలోని వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతన్నారని, వాటిని పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జులై 1 నుంచి పెంచిన పింఛన్లను వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో పంపిణీ చేస్తామని చెప్పారు. మూడు నెలల పింఛన్లు కలిపి అందజేస్తామన్నారు. గత ప్రభుత్వం ఆపేసిన సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభిస్తామన్నారు.

Tags :

మరిన్ని