CM Chandrababu: అసెంబ్లీలో చంద్రబాబుకు గౌరవ స్వాగతం పలికిన సభ్యులు

రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబుకు (Chandrababu) శాసనసభ సభ్యులు గౌరవ స్వాగతం పలికారు. ‘నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది’ అంటూ తెదేపా ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు.

Updated : 21 Jun 2024 14:55 IST

రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబుకు (Chandrababu) శాసనసభ సభ్యులు గౌరవ స్వాగతం పలికారు. ‘నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది’ అంటూ తెదేపా ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ ఆలింగనం చేసుకున్నారు. గతంలో వైకాపా నేతలు తీవ్రంగా కించపరడంతో సీఎంగానే మళ్లీ అడుగుపెడతానని 2021లో చంద్రబాబు శపథం చేశారు. అది నేడు నెరవేరింది. దీంతో గౌరవసభకు స్వాగతం అంటూ తెదేపా ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు