AP News: ధర్మారెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డిపై విజిలెన్స్‌ విచారణ

వైకాపాతో అంటకాగి ఆ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసిన మరో ఇద్దరు అధికారులపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.

Published : 11 Jul 2024 09:22 IST

వైకాపాతో అంటకాగి ఆ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసిన మరో ఇద్దరు అధికారులపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. తిరుమలలో జరిగిన అనేక అవకతవకలపై తితిదే మాజీ ఈఓ ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అలాగే సమాచార పౌరసంబంధాల శాఖ మాజీ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డిపైనా దర్యాప్తునకు సర్కార్  ఆదేశాలిచ్చింది. ఇద్దరు అధికారులూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టాలని, వీరి అవినీతికి సహకరించిన ఇతర ఉద్యోగులనూ విచారణ పరిధిలోకి తీసుకురావాలని నిర్దేశించింది.  

Tags :

మరిన్ని