Vijay sethupathi: రామోజీరావు విజన్‌కు ఫిల్మ్ సిటీ నిర్మాణమే నిదర్శనం: విజయ్ సేతుపతి

సినిమాకు కావల్సినవన్నీ ఫిల్మ్ సిటీ రూపంలో సమకూర్చడం తనను ఆశ్చర్యపోయేలా చేసిందన్నారు. తన తాజా చిత్రం ‘మహారాజ’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన విజయ్ సేతుపతి.. రామోజీరావు మరణం తనకు చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 10 Jun 2024 17:36 IST

రామోజీ ఫిల్మ్ సిటీ వల్ల ఎంతో మంది దర్శకులు తమ కలలను నిజం చేసుకున్నారని ప్రముఖ తమిళనటుడు విజయ్ సేతుపతి (Vijay sethupathi) అన్నారు. రామోజీరావు విజన్‌కు ఫిల్మ్ సిటీ నిదర్శనమని పేర్కొన్నారు. ఓ సినిమాకు కావల్సినవన్నీ ఫిల్మ్ సిటీ రూపంలో సమకూర్చడం తనను ఆశ్చర్యపోయేలా చేసిందన్నారు. తన తాజా చిత్రం ‘మహారాజ’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన విజయ్ సేతుపతి.. రామోజీరావు మరణం తనకు చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ వస్తే ఫిల్మ్ సిటీనే గుర్తుకు వస్తుందని చెప్పారు. 2005లో ధనుష్‌తో చేసిన సినిమా కోసం తొలిసారి ఆర్ఎఫ్‌సీకి వచ్చిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సంతాపాన్ని ప్రకటించారు. 

Tags :

మరిన్ని