Warangal: బడిబాట పట్టిన విద్యార్థులు.. బ్యాండ్‌బాజాలతో ఘనస్వాగతం

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో బడిబాట పట్టిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.

Published : 12 Jun 2024 16:02 IST

వేసవి సెలవులు ముగియడంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలలు బుధవారం పునఃప్రారంభమయ్యాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో బడిబాట పట్టిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఇల్లందు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థులు, గురువులకు స్వాగతం పలుకుతూ రంగవల్లులు తీర్చిదిద్దారు. విద్యార్థులపై పూలు చల్లుతూ బ్యాండ్‌బాజాలతో పాఠశాలలోకి ఆహ్వానించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు