Krishna District: కృష్ణా జిల్లాలో తహశీల్దార్‌ను గదిలో నిర్బంధించిన వీఆర్వో..!

కృష్ణా జిల్లా ఘంటసాల తహశీల్దార్ విజయలక్ష్మిని ఆమె కార్యాలయం గదిలో ఘంటసాలవారిపాలెం వీఆర్‌వో మల్లీశ్వరి 10 నిమిషాల పాటు నిర్బంధించింది. వీఆర్‌వో మల్లీశ్వరి.. గది బయట బైఠాయించి ఆందోళనకు దిగారు.

Published : 09 Jul 2024 21:01 IST

కృష్ణా జిల్లా ఘంటసాల తహశీల్దార్ విజయలక్ష్మిని ఆమె కార్యాలయం గదిలో ఘంటసాలవారిపాలెం వీఆర్‌వో మల్లీశ్వరి 10 నిమిషాల పాటు నిర్బంధించింది. వీఆర్‌ఏ మౌనికకు, మల్లీశ్వరికి మధ్య పాస్ బుక్‌ల మంజూరు, ఇతర ధ్రువీకరణ పత్రాలకు రిపోర్టులు రాసే విషయంలో కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. అవి తారస్థాయికి చేరడంతో మల్లీశ్వరిని సరెండర్ చేస్తూ మచిలీపట్నం ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో తహశీల్దార్‌ను గదిలో బంధించి.. తనకు న్యాయం చేయాలంటూ తన కుమారుడితో కలసి వీఆర్‌వో మల్లీశ్వరి.. గది బయట బైఠాయించి ఆందోళనకు దిగారు. తహశీల్దార్ వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో వారు కార్యాలయానికి చేరుకుని తలుపులు తెరిచారు.

Tags :

మరిన్ని