Vijayawada: పెట్రోల్‌కు బదులుగా నీళ్లు.. బంకు యజమానిపై స్థానికుల ఆగ్రహం!

విజయవాడ ఆంధ్రప్రభ కాలనీలోని ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌కు బదులుగా నీళ్లు వచ్చాయని వాహనదారులు వాపోయారు.

Published : 07 Jul 2024 13:51 IST

విజయవాడ ఆంధ్రప్రభ కాలనీలోని ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌కు బదులుగా నీళ్లు వచ్చాయని వాహనదారులు వాపోయారు. పెట్రోల్ కొట్టించుకొని కొంత దూరం వెళ్లాక దారి మధ్యలో బైక్ ఆగిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. మరమ్మతుల కోసం వాహనాన్ని మెకానిక్ వద్దకు తీసుకెళ్తే.. అందులో పెట్రోల్ బదులు నీళ్లు ఉన్నాయని చెప్పారు. పెట్రోల్ బంకు యజమానిని నిలదీస్తే వాహనాలను రిపేర్ చేయిస్తానన్నారని తెలిపారు. సుమారు 30 వాహనాలు ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Tags :

మరిన్ని