Ponguleti: జులై మొదటి వారం నుంచి రుణమాఫీ ప్రక్రియ : మంత్రి పొంగులేటి

మూడేళ్లలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.

Published : 22 Jun 2024 15:13 IST

మూడేళ్లలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం.. త్వరలోనే రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో మంత్రి పర్యటించారు. రూ.31వేల కోట్లతో రైతుల రుణాలను మాఫీ చేయనున్నామని పొంగులేటి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని చెప్పారు. 

Tags :

మరిన్ని