Revanth Reddy: హైదరాబాద్‌ను హెల్త్ టూరిజం హబ్‌గా మారుస్తాం : సీఎం రేవంత్

గ్లోబల్ సిటీగా ఎదుగుతోన్న హైదరాబాద్ మహానగరాన్ని హెల్త్ టూరిజం హబ్‌గా మార్చుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Published : 22 Jun 2024 16:08 IST

గ్లోబల్ సిటీగా ఎదుగుతోన్న హైదరాబాద్ మహానగరాన్ని హెల్త్ టూరిజం హబ్‌గా మార్చుతామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని శంషాబాద్ పరిసరాల్లో వెయ్యి ఎకరాలకు సేకరించి బహుళ జాతీ సంస్థలను రప్పిస్తామని వెల్లడించారు. హెల్త్ టూరిజం హబ్‌లో బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

Tags :

మరిన్ని