Viral video: కారు రివర్స్‌ చేస్తుండగా.. లోయలో పడి యువతి మృతి

కారు రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లోయలో పడి యువతి మృతి చెందిన విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

Updated : 18 Jun 2024 14:29 IST

కారు రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లోయలో పడి యువతి మృతి చెందిన విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. శూలీభంజన్ కొండపై 23 ఏళ్ల శ్వేత దీపక్ అనే యువతి.. కారు రివర్స్ చేస్తుండగా వాహనంతో సహా 300 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. సోమవారం ఔరంగాబాద్ నుంచి శూలీభంజన్ కొండకు శ్వేత.. ఆమె మిత్రుడు సూరజ్ విహార యాత్రకు వెళ్లినట్టు చెప్పారు. శ్వేత కారును రివర్స్ చేస్తుండగా.. సూరజ్ వీడియో రికార్డు చేస్తున్నాడని తెలిపారు. కారు వేగంగా వెనక్కు వెళ్తుండడాన్ని గమనించిన సూరజ్.. క్లచ్‌పై కాలు వేయమని శ్వేతకు సూచించడం దృశ్యాల్లో కనిపిస్తోంది. కారు వేగం పెరగడంతో పరిస్థితి అర్థమైన సూరజ్.. శ్వేతను రక్షించేందుకు యత్నించినప్పటికీ అప్పటికే కారు లోయలో పడినట్టు పోలీసులు వివరించారు. 

Tags :

మరిన్ని