AP News: స్థలం కబ్జా చేసిన వైకాపా కార్పొరేటర్.. మహిళ ఆత్మహత్యాయత్నం

వైకాపా కార్పొరేటర్‌ తమ భూమిని కబ్జా చేశారని, న్యాయం చేయాలంటూ ఓ జంట ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించింది.

Updated : 25 Jun 2024 16:20 IST

స్థలం కబ్జా చేసిన వైకాపా కార్పొరేటర్.. మహిళ ఆత్మహత్యాయత్నం

వైకాపా కార్పొరేటర్‌ తమ భూమిని కబ్జా చేశారని, న్యాయం చేయాలంటూ ఓ జంట ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. బాధితుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన దంపతులకు నగరంలో 1200 గజాల స్థలం ఉంది. దానిని వైకాపాకు చెందిన మహిళా కార్పొరేటర్ కబ్జా చేశారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న ఓ భవనంపైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించడంతో పోలీసులు వెంటనే స్పందించి వారిని కాపాడారు.

Tags :

మరిన్ని