Raj Tarun: నటుడు రాజ్‌తరుణ్‌పై నార్సింగి స్టేషన్‌లో యువతి ఫిర్యాదు

సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tarun) తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Published : 05 Jul 2024 16:01 IST

సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ (Raj Tarun) తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్‌, తాను 2012 నుంచి రిలేషన్‌లో ఉన్నామని, ఇటీవల మరో సినీనటితో అతను సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదును నార్సింగ్‌ పోలీసులు స్వీకరించారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని నార్సింగి సీఐ హరికృష్ణ రెడ్డి తెలిపారు. ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో ఓ డ్రగ్స్‌ కేసులో నిందితురాలిగా ఉన్నట్టు సీఐ వెల్లడించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు